అ: నా గొంతు శ్రుతిలోనా నా గుండె లయలోనా...
ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ: నా గొంతు శ్రుతిలోనా నా గుండె లయలోనా...
ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
అ: నా గొంతు శ్రుతిలోనా
ఆ: నా గుండె లయలోనా
అ: ఒకమాట పది మాటలై అది పాట కావాలనీ
ఆ: ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ
అ: అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని
ఆ: అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని
అ: కడలి లో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలనీ
అ/ఆ : పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ: నా గొంతు శ్రుతిలోనా
అ: నా గుండె లయలోనా
ఆ: ఫ్రతి రోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ
అ: ఫ్రతి రేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
ఆ: కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలనీ
అ: కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలనీ
అ: తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపొవాలనీ
అ/ఆ : పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ: నా గొంతు శ్రుతిలోనా
అ: నా గుండె లయలోనా
అ: పాడవే పాడవే కోయిలా
ఆ: పాడుతూ పరవశించు జన్మ జన్మల
చిత్రం : జానకి రాముడు
సంగీతం : కె వి మహదేవన్
గానం : యస్.పి.బాలు, చిత్ర
No comments:
Post a Comment