అ: మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)
గానమిదీ నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)
అ: ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ

ఆ: ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
అ: నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
అ: నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
ఆ: అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
అ: మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ఆ: చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
ఆ: చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
అ: రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం
చేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం
ఆ: ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
అ: మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ఆ: అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది

చిత్రం : మహర్షి
సంగీతం : ఇళయరాజా
గానం : యస్.పి.బాలు, జానకి
రచన: ఆత్రేయ
సంవత్సరం: 1988
No comments:
Post a Comment