Welcome to LyricLand, where the place lyrics of songs from various languages. You can express many feelings through the lyrics...
Showing posts with label Chiranjeevi. Show all posts
Showing posts with label Chiranjeevi. Show all posts
Friday, December 24, 2010
Aura amak challa... - Apandhabhandavudu
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల
ఐనవాడే అందరికి ఐనా అందడు ఎవ్వరికి (2)
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
నల్లరాతి కండలతో కరుకైనవాడే వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాణ పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఆఆ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల
చిత్రం : ఆపద్భాందవుడు
గానం : ఎస్ పి బాలు , చిత్ర
సంగీతం : ఎం ఎం కీరవాణి
Malli Malli idi raani roju - Rakshasudu
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైనా ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం
ఎందల్లో వెన్నెల్లొ ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా యదే తుమ్మెదై సన్నిధే చేరగా
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం
దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లొ ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని
గులాబిలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేది
సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కొరగా
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
చిత్రం : రాక్షసుడు
గానం : ఎస్ పి బాలు , వాణిశ్రీ
సంగీతం : ఇళయరాజా
Subscribe to:
Posts (Atom)