Pages

Showing posts with label Love. Show all posts
Showing posts with label Love. Show all posts

Friday, December 24, 2010

Maate raani chinnadaani kallu palike - Oh paapa laali





Audio Here : 
<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/O+Paapa+Laali.html?e">Listen to O Paapa Laali Audio Songs at MusicMazaa.com</a></p>
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా (2)

వెన్నెలల్లె పూలు విరిసి తేనేలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు


చిత్రం : ఓ పాప లాలి
గానం : ఎస్ పి బాలు 
సంగీతం : ఇళయరాజా 
Youtube Video : 



Telusa manasa - Criminal


తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది - 'తెలుసా'

ప్రతి క్షణం --- నా కళ్ళలో నిలిచే నీ రూపం 
బ్రతుకులో --- అడుగడుగునా నడిపే నీ స్నేహం 
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా... 
పది కాలాలు వుంటాను నీ ప్రేం సాక్షిగా. ... 'తెలుసా'

Aahaa ....aahaaa....
aa............aaaaa.......
Aa..aa....aaaa...aaaa....

Darling......,
Every breath you take,
Every move you make, I will be there with you,
What would I do 
without you?,
I want to love you forever... and ever & ever!!!

ఎన్నడు ---తీరిపోని రుణముగా వుండిపో...
చెలిమితో---తీగ సాగే మల్లెగా అల్లుకో...
లోకమే ... మారిన .. కాలమే .. ఆగిన....
మన ఈ గాధ మిగలాలి తుది లేని చరితగా.... 'తెలుసా'

Aahaa ....aahaaa....
aa............aaaaa.......
Aa..aa....aaaa...aaaa....



చిత్రం : క్రిమినల్
గానం : ఎస్ పి బాలు
సంగీతం : ఎం ఎం కీరవాణి

Helloguru Prema kosame ra..- Nirnayam





హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్నా తాఖీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరొ ఈ జీవితం (2)

కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవు సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా
అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ
హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం (2)


చిత్రం : నిర్ణయం 
గానం : ఎస్ పి బాలు 
సంగీతం : ఇళయరాజా 



Monday, November 29, 2010

Alupannadi Unda Song Lyrics From Gaayam



అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరిమరి ఉరికే మది తలపులకు..ల ల ..ల ల...లలలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నా కోసమే చినుకై కరిగి అకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు ...
కలలను తేవా నా కన్నులకు ..ల ల ..ల ల...లలలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నీ చూపులే తడిమే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు .....
ఎదురుగ నడిచే తొలి ఆశలకు ...లల ..లల...ల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరిమరి ఉరికే మది తలపులకు..ల ల ..ల ల...లలలలలా


చిత్రంగాయం 
సంగీతం: శ్రీ
రచనసిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానంచిత్ర

Saturday, November 27, 2010

Mellaga Karagani Song Lyrics From Varsham


అ: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
ఆ: చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
అ: వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం 
ఆ: చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
అ: తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
   ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
   మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
ఆ: చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం

అ: నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
   ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ: ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా
   ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
అ: మతి చెడే  దాహమై అనుసరించి వస్తున్నా
ఆ: జత పడే స్నేహమై అనునయించనా
అ: చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
   ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఆ: ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా
   నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
అ: ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా 
   ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా 
ఆ: త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
అ: విడుదలే వద్దనే ముడులు వేయనా
ఆ: మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా
అ: ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

అ: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
ఆ: చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
అ: వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
ఆ: చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
అ: తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
   ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం



చిత్రం: వర్షం(2003)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానంయస్.పి.బి.చరణ్, సుమంగళి


అ: అతడు ఆ: ఆమె

Wednesday, November 24, 2010

Ku Ku Ku Kokila Raave Lyrics From Sitara



కుకుకు కుకుకు
కుకుకు కుకుకు కోకిల రావే (2) 
రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో   
కుకుకు కుకుకు కోకిల రావే

రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో (2)
స్వరమై రావే విరిపొదల యదలకు
కుకుకు కుకుకు కోకిల రావే

సూర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి రావే గడప తలుపు దాటి రావే
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో (2)
లయగా రావే ప్రియ హృదయ జతులకు
కుకుకు కుకుకు కోకిల రావే (2)
రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకు కుకుకు కోకిల రావే 





చిత్రం: సితార(1983)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: యస్.పి.బాలు,జానకి

Tuesday, November 23, 2010

Jilibili Palukula Song From Sitara





అ: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
   కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
   మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార (2)
   మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
   కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా
   జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
   కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా


అ: అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
   చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
   తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా (2)
   హరివిల్లు రంగుల్లో వర్ణాలే
   చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా
   జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా


ఆ: ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
   మెరుపులలో నిలకడగా కనిపించే ఏమైనా
   ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ (2)
   వినువిధి వీణల్లో రాగంలా
   ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా


అ: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఆ: తొలకరి వయసుల మిణుగురు సొగసులదే మైనా మైనా
అ: మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
ఆ: గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం
అ: మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
ఆ: చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా
అ: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఆ: తొలకరి వయసుల మిణుగురు సొగసులదే మైనా మైనా 




చిత్రం: సితార(1983)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: యస్.పి.బాలు,జానకి


అ : అతడు      ఆ : ఆమె

Monday, November 22, 2010

Mata Rani Mounamidi Song From Maharshi



అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)
     గానమిదీ  నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
     ప్రాణమైన మూగ గుండె రాగమిది
     మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)

అ:  ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
     ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఆ:  ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
     ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
అ:  నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
ఆ:  అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

ఆ:  చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
     రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
అ:  రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం
      చేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం
ఆ:  ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ఆ:  అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
     దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది
     చెప్పరాని చిక్కుముడి వీడనిది
అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ఆ:  అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది


చిత్రం : మహర్షి
సంగీతం : ఇళయరాజా 
గానం : యస్.పి.బాలు, జానకి
రచన: ఆత్రేయ
సంవత్సరం: 1988


Saturday, November 20, 2010

Chinuku Chinuku Ga Song Lyrics



అ: చినుకు చినుకుగా చిగురు మెత్తగ
    గోరు వెచ్చగా గుండె విచ్చగా
    చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి
ఆ: చినుకు చినుకుగా చిగురు మెత్తగా
     గోరు వెచ్చగా గుండె విచ్చగా

అ: అల్లన ఉదయించే ప్రతి కిరణం
    చల్లగ చలియించే నీ చరణం
ఆ: నింగిని విహరించే ప్రతి మేఘం  
     పొంగిన ప్రేమకు సందేశం
అ: ఊహలే ఊసులై
ఆ: ఆశలే బాసలై
అ: హే హే ఊహలే ఊసులై
ఆ: ఆశలే బాసలై  
అ: మథువులు చిలుకగా మథురిమలొలుకుగ
     ప్రణయ వేళ మంత్రమేదో పలుకగా
ఆ: చినుకు చినుకుగా చిగురు మెత్తగా
అ: గోరు వెచ్చగా గుండె విచ్చగా
    చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి
    చినుకు చినుకుగా చిగురు మెత్తగా
ఆ: గోరు వెచ్చగా గుండె విచ్చగ

అ: వలచిన జంటను కనగానే చిలకలకే కన్ను చెదిరింది
ఆ: కవితలకందని పలుకులలో కమ్మని దీవెన కురిసింది
అ: కడలియె గగనమై
ఆ: గగనమే కడలియై
అ: హ హ కడలియే గగనమై
ఆ: గగనమే కడలియై
అ: సహచరి నడకల స్వరఝరి తొణకగా
    సరస రమ్య దివ్య సీమ నిలుపగా
అ: చినుకు చినుకుగా చిగురు మెత్తగ
ఆ: గోరు వెచ్చగా గుండె విచ్చగా
అ: చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి
    చినుకు చినుకుగా చిగురు మెత్తగా
ఆ: గోరు వెచ్చగా గుండె విచ్చగా(3)


చిత్రం : ముక్కు పుడక (1983)
సంగీతం : జె.వి.రాఘవులు 
రచన : సి.నారాయణ రెడ్డి 

Friday, November 19, 2010

Chinukulaa Raali -- Naalugu Stambaalaata




అ : చినుకులా రాలి.... నదులుగా సాగి...
    వరదలై పొయి కడలిగా పొంగు
    నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
    నదివి నీవు కడలి నేను
    మరచిపోబోకుమా... మమత నీవే సుమా...    

ఆ : చినుకులా రాలి.... నదులుగా సాగి...
    వరదలై పొయి కడలిగా పొంగు
    నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

అ : ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే      
    కుంకుమ పూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే       

ఆ : ప్రేమలు కోరే జన్మల లొనే నే వేచి ఉంటానులే 
    జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లుఔతానులే

అ : ఆ చల్లని జాడ నేనే  

ఆ : హిమములా రాలి సుమములై పూసి 
    ఋతువులై నవ్వి మతువులై పొంగు      
    నీ ప్రేమ నా ప్రేమ నీ పెరీ నా ప్రెమ
    శిశిరమైనా శిథిలమైనా 
    విడిచి పూబోకుమా విరహమై పోకుమా           

ఆ : తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే   
    పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే     
   
అ : నింగికి నేల అంకితలాడే ఆ పొద్దు రావాలిలే  
    నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే    

ఆ : ఆ తీరాలు చేరాలిలే...   

అ : మౌనమై మెరిసి గానమై పిలిచి  
    కలలతో అలిసి గగనమై ఎగసి 
    నీ ప్రేమ నా ప్రేమ 
    తారాడే మన ప్రేమ    
    భువనమైనా గగనమైనా 
    ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా  

ఆ : చినుకులా రాలి.... 

అ : నదులుగా సాగి...

ఆ : వరదలై పొయి... 

అ : కడలిగా పొంగు...
    
అ/ఆ:  నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

ఆఆహ ఆఆహ  ఆఆహ ఆఆహా... ఆఆహ.


చిత్రం : నాలుగు స్తంభాలాట
సంగీతం : రాజన్ - నాగేంద్ర 
గానం : యస్.పి.బాలు, పి.సుశీల

అ : అతడు      ఆ : ఆమె