Pages

Monday, November 29, 2010

Alupannadi Unda Song Lyrics From Gaayam



అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరిమరి ఉరికే మది తలపులకు..ల ల ..ల ల...లలలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నా కోసమే చినుకై కరిగి అకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు ...
కలలను తేవా నా కన్నులకు ..ల ల ..ల ల...లలలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నీ చూపులే తడిమే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు .....
ఎదురుగ నడిచే తొలి ఆశలకు ...లల ..లల...ల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరిమరి ఉరికే మది తలపులకు..ల ల ..ల ల...లలలలలా


చిత్రంగాయం 
సంగీతం: శ్రీ
రచనసిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానంచిత్ర

Saturday, November 27, 2010

Mellaga Karagani Song Lyrics From Varsham


అ: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
ఆ: చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
అ: వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం 
ఆ: చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
అ: తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
   ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
   మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
ఆ: చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం

అ: నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
   ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ: ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా
   ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
అ: మతి చెడే  దాహమై అనుసరించి వస్తున్నా
ఆ: జత పడే స్నేహమై అనునయించనా
అ: చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
   ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఆ: ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా
   నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
అ: ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా 
   ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా 
ఆ: త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
అ: విడుదలే వద్దనే ముడులు వేయనా
ఆ: మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా
అ: ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

అ: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
ఆ: చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
అ: వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
ఆ: చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
అ: తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
   ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
   ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం



చిత్రం: వర్షం(2003)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానంయస్.పి.బి.చరణ్, సుమంగళి


అ: అతడు ఆ: ఆమె

Wednesday, November 24, 2010

Ku Ku Ku Kokila Raave Lyrics From Sitara



కుకుకు కుకుకు
కుకుకు కుకుకు కోకిల రావే (2) 
రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో   
కుకుకు కుకుకు కోకిల రావే

రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో (2)
స్వరమై రావే విరిపొదల యదలకు
కుకుకు కుకుకు కోకిల రావే

సూర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి రావే గడప తలుపు దాటి రావే
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో (2)
లయగా రావే ప్రియ హృదయ జతులకు
కుకుకు కుకుకు కోకిల రావే (2)
రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకు కుకుకు కోకిల రావే 





చిత్రం: సితార(1983)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: యస్.పి.బాలు,జానకి

Tuesday, November 23, 2010

Jilibili Palukula Song From Sitara





అ: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
   కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
   మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార (2)
   మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
   కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా
   జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
   కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా


అ: అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
   చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
   తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా (2)
   హరివిల్లు రంగుల్లో వర్ణాలే
   చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా
   జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా


ఆ: ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
   మెరుపులలో నిలకడగా కనిపించే ఏమైనా
   ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ (2)
   వినువిధి వీణల్లో రాగంలా
   ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా


అ: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఆ: తొలకరి వయసుల మిణుగురు సొగసులదే మైనా మైనా
అ: మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
ఆ: గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం
అ: మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
ఆ: చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా
అ: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఆ: తొలకరి వయసుల మిణుగురు సొగసులదే మైనా మైనా 




చిత్రం: సితార(1983)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: యస్.పి.బాలు,జానకి


అ : అతడు      ఆ : ఆమె

Kinnerasaani Vachindamma Lyrics From Sitara






అ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి (2)
   విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై
   కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
ఆ: పచ్చని చేల పావడ గట్టి
   పచ్చని చేల పావడ గట్టి కొండ మల్లెలే కొప్పున బెట్టి    
   వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
ఆ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
అ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి


అ: ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవ పాణి  
   కోటను విడిచి పేటను విడిచి (2)  
ఆ: కనుల గంగ పొంగే వేళ
   నదిలా తానే సాగే వేళ
   రాగాల రాదారి పూదారి అవుతుంటే
   ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే  
అ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
ఆ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి


ఆ: మాగాణమ్మ చీరలు నేసే మలి సందెమ్మ కుంకుమ పూసే
   మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మ (2)
అ: గదపే దాటి నడిచే వేళ
   అదుపే విడిచి ఎగిరే వేళ
   వయ్యారి అందాలు గొదారి చూస్తుంటే
   ఈ వయ్యారి అందాలు గొదారి చూస్తుంటే  
ఆ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
అ: కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
ఆ: విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై
అ: కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
ఆ: పచ్చని చేల
అ: పావడ గట్టి
ఆ: ఓయ్ పచ్చని చేల పావడ గట్టి
అ: కొంద మల్లెలె కొప్పున బెట్టి  
ఆ: వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
అ: వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని


చిత్రం: సితార(1983)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: యస్.పి.బాలు,యస్.పి.శైలజ       

అ : అతడు      ఆ : ఆమె

Monday, November 22, 2010

Mata Rani Mounamidi Song From Maharshi



అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)
     గానమిదీ  నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
     ప్రాణమైన మూగ గుండె రాగమిది
     మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)

అ:  ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
     ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఆ:  ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
     ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
అ:  నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
ఆ:  అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

ఆ:  చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
     రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
అ:  రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం
      చేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం
ఆ:  ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ఆ:  అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
     దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది
     చెప్పరాని చిక్కుముడి వీడనిది
అ:  మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ఆ:  అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది


చిత్రం : మహర్షి
సంగీతం : ఇళయరాజా 
గానం : యస్.పి.బాలు, జానకి
రచన: ఆత్రేయ
సంవత్సరం: 1988


Saturday, November 20, 2010

Chinuku Chinuku Ga Song Lyrics



అ: చినుకు చినుకుగా చిగురు మెత్తగ
    గోరు వెచ్చగా గుండె విచ్చగా
    చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి
ఆ: చినుకు చినుకుగా చిగురు మెత్తగా
     గోరు వెచ్చగా గుండె విచ్చగా

అ: అల్లన ఉదయించే ప్రతి కిరణం
    చల్లగ చలియించే నీ చరణం
ఆ: నింగిని విహరించే ప్రతి మేఘం  
     పొంగిన ప్రేమకు సందేశం
అ: ఊహలే ఊసులై
ఆ: ఆశలే బాసలై
అ: హే హే ఊహలే ఊసులై
ఆ: ఆశలే బాసలై  
అ: మథువులు చిలుకగా మథురిమలొలుకుగ
     ప్రణయ వేళ మంత్రమేదో పలుకగా
ఆ: చినుకు చినుకుగా చిగురు మెత్తగా
అ: గోరు వెచ్చగా గుండె విచ్చగా
    చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి
    చినుకు చినుకుగా చిగురు మెత్తగా
ఆ: గోరు వెచ్చగా గుండె విచ్చగ

అ: వలచిన జంటను కనగానే చిలకలకే కన్ను చెదిరింది
ఆ: కవితలకందని పలుకులలో కమ్మని దీవెన కురిసింది
అ: కడలియె గగనమై
ఆ: గగనమే కడలియై
అ: హ హ కడలియే గగనమై
ఆ: గగనమే కడలియై
అ: సహచరి నడకల స్వరఝరి తొణకగా
    సరస రమ్య దివ్య సీమ నిలుపగా
అ: చినుకు చినుకుగా చిగురు మెత్తగ
ఆ: గోరు వెచ్చగా గుండె విచ్చగా
అ: చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి
    చినుకు చినుకుగా చిగురు మెత్తగా
ఆ: గోరు వెచ్చగా గుండె విచ్చగా(3)


చిత్రం : ముక్కు పుడక (1983)
సంగీతం : జె.వి.రాఘవులు 
రచన : సి.నారాయణ రెడ్డి